‘దిశ’ ట్రెండ్ సెట్టర్.. పూజల హరి కృష్ణ

అతి తక్కువ కాలంలోనే దిశ దిన పత్రిక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ అన్నారు.

Update: 2025-01-04 08:14 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అతి తక్కువ కాలంలోనే దిశ దిన పత్రిక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో దిశ దిన పత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను దిశ జిల్లా ప్రతినిధి తిప్పర్తి భాస్కర్, దిశ నంగునూరు విలేఖరి న్యాలకొండ శ్రీధర్ రెడ్డి, దిశ సిద్దిపేట అర్బన్ మండల విలేఖరి బండోజి సిద్దయ్యలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి పూజల హరి కృష్ణ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హరి కృష్ణ మాట్లాడుతూ... నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురిస్తూ దిశ దిన పత్రిక అనతి కాలంలోనే ప్రజలకు చేరువ అయిందని అన్నారు. వాస్తవాలను ప్రజలకు నిర్భయంగా తెలియజేయడంలో దిశ దిన పత్రిక ముందు వరసలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీ, నాయకులు కలీమొద్దీన్, వహాబ్, బిక్షపతి, మెరుగు రాజు, జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News