విద్యుత్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ నేతలు ఫైర్..

రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలతో రైతులను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు..

Update: 2023-02-14 08:19 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలతో రైతులను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరుఫరా చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నట్టుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. వ్యవసాయానికి 4 గంటలు కూడా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తలేరని టీపీసీసీ సభ్యుడు దరిపల్లి. చంద్రం, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ బొమ్మల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. విద్యుత్ చార్జీ పెంపును నిరసిస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విద్యత్ ఎస్ ఈ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించి, వినతీపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల మరునాడే విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. విద్యుత్ చార్జీ పెంపు నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకొవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చొప్పదండి చంద్రశేఖర్, లక్కరసు సూర్యవర్మ, కలీమోద్దిన్, ముద్దం లక్ష్మీ, దేవులపల్లి యాదగిరి, మార్క సతీష్, దాస అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News