ఒక మ్యాచ్ లో డక్ అవుట్ అయితే.. మరో మ్యాచ్ లో సెంచరీ కొడతా : మైనంపల్లి హనుమంతరావు..
సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు కిందపడిన విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ట్రోలింగ్ చేయడం పై కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు కిందపడిన విషయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ట్రోలింగ్ చేయడం పై కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక మ్యాచ్ లో డక్ అవుట్ అయితే.. మరో మ్యాచ్ లో సెంచరీ కొడతా.. అల్ రౌండర్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని సిద్దిపేటలో కార్యక్రమాలు నిర్వహిస్తే హరీష్ రావుకు కండ్లు మండిపోతున్నాయని ఫైర్ అయ్యారు. మున్సిపల్ కార్మికులకు చీరల పంపిణీ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల చేత నినాదాలు చేయించడం.. గ్రౌండ్ లో క్రికెట్ టోర్నీ జరగకుండా ఆటంకపరచడం పిరికిపంద చర్య అన్నారు.
కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రజలను రెచ్చగొట్టె ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే బీఆర్ఎస్ నాయకులు పర్యటించలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఓట్ల రాజకీయం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకున్న చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది అన్నారు. తెలివి లేని వాడ చిల్లర రాజకీయాలు మానుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు హితవు పలికారు. మైండ్ దొబ్బిందా..? దమ్ముంటే రా..? ఐ యమ్ వారియర్ అని ఎమ్మెల్యే హరీష్ రావుకు సవాల్ విసిరారు. మీరు ఎమైనా తోపులా..? రాజకీయంగా విడిచిపెట్టే ప్రసక్తే లేదని మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్, నరకుల శివప్ప, బొమ్మల యాదగిరి, అత్తు ఇమామ్, రాజ్ బహదూర్ రెడ్డి, ఆలకుంట మహేందర్, సాకి అనంద్, కలీమోద్దిన్, ముద్దం లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.