మైనార్టీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ : సంగారెడ్డి ఎమ్మెల్యే

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలను

Update: 2025-04-03 13:29 GMT

దిశ, సంగారెడ్డి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలను అన్యాయం చేసిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హకీమ్, మైనార్టీ సోదరులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం తో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ఎన్నికల్లో రూ.4 వేల కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు బడ్జెట్ లో రూ.3 వేల కోట్లు పెట్టారని అందులో రూ.1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. ఖర్చు చేసిన కొద్ది పాటి రూపాయలు కూడా కేసీఆర్ ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకులాల కోసం మాత్రమే ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు షాది ముబారక్, తులం బంగారం మాటే లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో హకీమ్, వజిత్, ఆర్ వెంకటేశ్వర్లు, మధుసూదన్ రెడ్డి, పాండు రంగం తదితరులు ఉన్నారు.

Similar News