Collector Manu Chaudhary : వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పకడ్బందీగా నిర్వహించాలి

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో నీట మునిగిన దుకాణ

Update: 2024-09-04 09:44 GMT

దిశ, కోహెడ : సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో నీట మునిగిన దుకాణ సముదాయాలను కలెక్టర్, సీపీ సందర్శించారు. ఈ సందర్భంగా బదుగుల చెరువు పూర్తిగా నిండి ఓవర్ ఫ్లో గా వస్తున్న వాటర్ నాలా ద్వారా ప్రవహిస్తూ కోహెడ గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలోకి ప్రవహించడంతో ఇండ్లు దెబ్బతిన్నాయి. డ్రైనేజ్ కూడా దెబ్బతిని ఇండ్లలోకి నీరు వచ్చింది. ఈ ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాలతో దెబ్బతిన్న, కూలిపోయిన ఇండ్ల వివరాలను త్వరగా అందించాలని, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలోని ఇండ్లలో, పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని జేసీబీ ద్వారా కాలువ తీసి నాలాలోకి మళ్లించాలని, గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్లపదలను తొలగించి శుభ్రంగా చేయాలనీ, వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పగడ్బందీగా నిర్వహించి ఫాగింగ్, నిలువ నీళ్లలో ఆయిల్ బాల్స్ వేయాలని, నాలాలపై అక్రమ నిర్మాణాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని, పంచాయతీరాజ్ ఇంజనీర్లతో గ్రామంలో అతి వర్షాలతో చెడిపోయిన డ్రైనేజీ ని పరిశీలించారు.

దానిని వెడల్పు చేయడం లోతు చేయడం, పూడికను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ సురేఖ, ఎంపీఓ శోభ లను ఆదేశించారు. వీధి కుక్కలను పట్టించి సిద్దిపేట లో ఉన్న అనిమల్స్ బర్త్ కంట్రోల్ సెంటర్ లో ఆపరేషన్ చేయించి వదిలి పెట్టాలని గ్రామ పంచాయతీ అధికారుల ఆదేశించారు. బదుగుల చెరువు నుండి తీగలకుంటపల్లి చెరువు వరకు నాలాను పూర్తిగా నిర్మించుటకు, ఇప్పటికీ ఉన్న వాల్ కు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచడం మరియు లోతు పెంచి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ వెంట హుస్నాబాద్ ఆర్ డి ఓ రామ్మూర్తి, ఏసీపి సతీష్ తదితరులు ఉన్నారు.


Similar News