కుప్పకూలిన గురుమిల వాగు బ్రిడ్జి
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం కుష్నూరు గ్రామ సమీపంలో గల గురుమిల వాగు పై ఉన్న లో లెవెల్ బ్రిడ్జి గురువారం కూలిపోయింది.
దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం కుష్నూరు గ్రామ సమీపంలో గల గురుమిల వాగు పై ఉన్న లో లెవెల్ బ్రిడ్జి గురువారం కూలిపోయింది. వెంటనే స్పందించిన రెవెన్యూ ,గ్రామపంచాయతీ అధికారులు రాకపోకలు నిలిపివేస్తూ రోడ్డుకు అడ్డంగా బారీకేడ్లు, ముళ్ల కంచను వేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి.
మంజీరా నది సమీపంలో రోడ్డు దెబ్బతీనడంతో మూడురోజులుగా సిరూర్ - రాయిపల్లి మధ్య రోడ్డు ను బంద్ చేయడంతో నారాయణ ఖేడ్ మెదక్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు కుస్నూర్, రాఘవాపూర్ మీదుగా వెళ్తున్నారు. కాగా చీమ్నాపూర్ - కుస్నూర్ మధ్య గల గురుమీల వాగు పై దశబ్దాల క్రితం నిర్మించిన లో లెవెల్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఈ ప్రాంత ప్రాయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి శ్రావణి కూలిపోయిన బ్రిడ్జిని సందర్శించారు.