అన్నదాతకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండగ మార్చిన సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిగా నిలిచాడని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.

Update: 2023-06-03 14:39 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండగ మార్చిన సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిగా నిలిచాడని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి రైతు వేదికలో రైతు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. గత పాలకుల పాలనలో కరెంట్ ఎప్పుడూ వస్తుందో.. ఎప్పుడూ పోతుందో తెలియదన్నారు.

అయోమయంలో ఉన్న తెలంగాణలో నేడు 24 గంటలు కరెంట్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఐదు నిమిషాల కరెంట్ పోయే గ్రామాల నుంచి స్వయంగా తనకే ఫోన్ చేసి అక్కా కరెంట్ పోయిందని చెబుతున్నారని తెలిపారు. రైతు వ్యవసాయం చేయాలంటే కనీసం పెట్టుబడి కూడా దొరికేది కాదన్నారు. అందుకే సీఎం కేసీఆర్ రైతుల ఇబ్బందులను గుర్తించి ప్రతి పంట సీజన్ లో ఎకరాకు రూ.5 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నారని గుర్తు చేశారు. రైతు ఏదైనా కారణంతో చనిపోతే వారి కుటుంబానికి కష్టం రాకుండా రూ.5 లక్షల రైతు బీమా అందిస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందన్నారు.

బీడు వారిన భూములకు కాళేశ్వరం నీళ్లు అందిస్తున్నామని, మండు వేసవిలో కూడా వాగులు పొంగిపొర్లతున్నాయంటే అది సీఎం కేసీఆర్ కృషేనని అన్నారు. రైతుల సంక్షేమంతో పాటు పేదల కోసం అనేక పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్ర ప్రవేశ పెట్టిన పథకాలు కేంద్రం అనుసరించే విధంగా ఉన్నాయన్నారు. మరింత అభివృద్ది ముందుకు సాగాలంటే మన సంక్షేమం కోసం కృషి చేసిన వారిని ఎప్పుడు గుర్తు చేసుకోవాలని కోరారు. అంతకు ముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో ర్యాలీగా రైతు వేదిక వద్దకు ఎమ్మెల్యేను తీసుకువచ్చారు.

Tags:    

Similar News