'నేను పదవిలో లేకున్నా అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్న..'
నేను పదివిలో లేకున్నా అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నానని.. వేరే వాళ్ళు చిల్లర ముచ్చట్లు చెబుతున్నారని, కొందరు పూటకో పార్టీలు మార్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఉద్దేశించి సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ ఘాటుగా విమర్శలు చేశారు.
దిశ, సదాశివపేట : నేను పదివిలో లేకున్నా అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నానని.. వేరే వాళ్ళు చిల్లర ముచ్చట్లు చెబుతున్నారని, కొందరు పూటకో పార్టీలు మార్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఉద్దేశించి సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ ఘాటుగా విమర్శలు చేశారు. మండల పరిధిలోని ఎన్కేపల్లి, చందాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి 200 మంది నాయకులు, కార్యకర్తలు చింతా ప్రభాకర్ సమక్షంలో ఆదివారం సదాశివపేటలోని ఆయన స్వగృహంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తుపాకీ రాముడి మాటలు మాట్లాడి ఓట్లు పొంది తాత్కాలికంగా మన్ననలను పొంది గెలవాలనుకునే నాయకుడు చింతా ప్రభాకర్ కాదని అన్నారు.
సెంటిమెంట్, సెంటి మెంట్ అని మన కళ్ళనే మనం పోడుచుకోవద్దని హితువు పలికారు. బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలకు కార్యకర్తలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా కార్యకర్తలు తీసుకెళ్లాలని అన్నారు. ప్రచారంలో మరింత జోష్ పెంచాలని వారికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షులు పెద్దగొల్ల అంజనేయులు, ఎంపీటీసీ అహ్మద్, ఎనకపల్లి సర్పంచ్ శేఖర్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు సల్లావుద్దీన్, మాజీ సర్పంచ్ లు చంద్రన్న, నర్సింలు, మాజీ ఎంపీటీసీ మానయ్య , నాయకులు షబ్బీర్ మియా, అప్సర్, అంబరీష్ , రమేష్, ముబీన్, బాబు మియా, తదితరు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.