దిశ ప్రతినిధి, సంగారెడ్డి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న మన ఊరు– మనబడి కార్యక్రమానికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లాఅధ్యక్షుడు చింతా ప్రభాకర్తన వంతు చేయూతనందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బడి బాగుకోసం విరాళాలు ఇవ్వాలని ఇటీవలే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఇతరులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రి హరీష్‌రావు రూ. 2లక్షలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల వేతనం అందించిన విషయం తెలిసిందే. కాగా, తన వంతుగా చింతా ప్రభాకర్రూ.2 లక్షల విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్హనుమంతారావు చింతా ప్రభాకర్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మేధావులు, విద్యవంతులు, ఇతరులు మన ఊరు–మన బడిలో భాగంగా పాఠశాలల బాగుకోసం విరాళాలు అందించాలని హనుమంతరావు కోరారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్బోధన చేపడుతున్న మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని ప్రభాకర్అన్నారు. పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు ఈ డబ్బులు వినియోగించాలని ప్రభాకర్కోరారు. ఈ మంచి కార్యక్రమానికి నా వంతుగా విరాళం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రభాకర్‌తో పాటు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, చక్రి, మోహన్‌నాయక్, మల్లేశం, శ్రావన్‌రెడ్డి తదిరులు ఉన్నారు.