108లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

పురిటి నొప్పులతో బాధ‌పడుతున్న మహిళను 108 అంబులెన్స్​‍లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటన సంగారెడ్డి జిల్లా చోటుచేసుకుంది.

Update: 2024-11-11 15:26 GMT

దిశ, ఝరాసంగం/రాయికోడ్ : పురిటి నొప్పులతో బాధ‌పడుతున్న మహిళను 108 అంబులెన్స్​‍లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటన సంగారెడ్డి జిల్లా చోటుచేసుకుంది. ఈ ఏంటి అరుణ్ కుమార్ వివరాల ప్రకారం... రాయికోడ్ మండలం శంశోద్దీన్ పూర్ గ్రామానికి చెందిన గద్ద సోని కి సోమవారం సాయంత్రం పురిటి నొప్పులు వస్తుండడంతో 108కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన 108 వాహనంతో గ్రామానికి చేరుకున్న సిబ్బంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న సోనీ ని 108 వాహనంలో తీసుకొని రాయికోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో రాయికోడ్ చౌరస్తా సమీపంలో ఆమె ప్రసవించింది. అనంతరం తల్లి బిడ్డలను రాయికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిబ్బందిని మండల వైద్యాధికారి అభినందించారు. ఈఎంటి అరుణ్ కుమార్, ఈఆర్సిపి వినయ్ కుమార్, యాదుల్,లకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


Similar News