ప్రతి ఒక్కరికి అందుబాటులో కేంద్ర పథకాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కేంద్రం అందజేస్తున్న పథకాలను వివరించి వాటిలో అందరినీ భాగస్వామ్యం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
దిశ, కంది : భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కేంద్రం అందజేస్తున్న పథకాలను వివరించి వాటిలో అందరినీ భాగస్వామ్యం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా సామాజిక అభ్యున్నతి, ఆధారిత ప్రజాసంక్షేమం పీఎం వర్చువల్‌గా పోర్టల్ సూరజ్ పోర్టల్ (PM-SURAJ) ప్రారంభించారు. ఆన్ లైన్‌లో దేశవ్యాప్తంగా 510 జిల్లాలను అనుసంధానం చేస్తూ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడుతూ…. ప్రధానమంత్రి రోజు ఏదో ఒక లబ్ధిదారులతో పథకాలపై మాట్లాడుతూ…. వారిని పథకాలల్లో భాగస్వామ్యం చేస్తున్నారన్నారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ పథకం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త చొరవతో, మానవీయ మురుగు, సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే ప్రమాదకర అభ్యాసాన్ని తొలగించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతుందని ఆమె వివరించారు.
ఇందులో ప్రధానమంత్రి మూడు జాతీయ కార్పొరేషన్‌లు (నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాస్ ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ NBCFDC, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్) కొత్త రుణగ్రహీతలతో సంభాషించారని తెలిపారు. ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSFDC), నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSKFDC), (NAMASTE) పథకం యొక్క లబ్ధిదారులు , మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కార్పొరేషన్‌ల సమూహం (షెడ్యూల్డ్ కులాలు, సఫాయి కర్మచారిలో, వెనుకబడిన తరగతులు, మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులు)లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని స్వయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డీన్ చంద్రశేఖర్ శర్మ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా సీజీఏం రాజేష్ కుమార్, కెనరా బ్యాంకు డీజీఎం ఆర్. శ్రీనివాస్ రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.