చిన్నశంకరంపేటలో కాంగ్రెస్ సంబురాలు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడడంతో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు.
దిశ, చిన్నశంకరంపేట : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడడంతో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. దీంతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు టపాకాయలు, కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న కాలంలో మెదక్ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ధిమా వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేసింది ఏమి లేదని నూతన మండలం ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నప్పటికీ బస్టాప్ కూడా నోచుకోలేని స్థితిలో నార్సింగి, చిన్నశంకరంపేట, మండలం ఉందని వారు ఏద్దేవా చేశారు. మైనంపల్లి రోహిత్ చిన్న శంకరంపేట మండలంలో ఎంతగానో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, జీవన్, శ్రీమాన్ రెడ్డి, ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి, జిల్లా ఎస్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగర్ల గోవర్ధన్, ముత్తిగల రామచంద్రన్, రమేష్ గౌడ్, లక్ష్మా గౌడ్, శేఖర్ గౌడ్, (గురు) శ్రీనివాస్ గౌడ్, అశోక్ గౌడ్, సత్యం గౌడ్, లింగంగౌడ్, సయ్యద్, ఆంజనేయులు, సుధాకర్, మేడి మురళి, ఎర్రి కుమార్ ,సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.