Narsapur MLA : గత ప్రభుత్వంలో మంజూరు చేసిన రోడ్లను రద్దు చేయడం విచారకరం

గత ప్రభుత్వంలో తండాలను అభివృద్ధి చేయడం కోసం

Update: 2024-08-26 13:43 GMT

దిశ,నర్సాపూర్ : గత ప్రభుత్వంలో తండాలను అభివృద్ధి చేయడం కోసం ఎస్టీ సబ్ ప్లాన్ కింద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన రోడ్లను నేటి ప్రభుత్వం రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆమె తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నర్సాపూర్ నియోజకవర్గానికి ఎస్టీ సబ్ ప్లాన్ కింద 24 రోడ్లకు గాను రూ.46 కోట్ల 35 లక్షలు మంజూరు చేస్తే వాటిని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. రద్దు చేసిన రోడ్లను వెంటనే తిరిగి మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల నిధులు మంజూరు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అధికారంలో ఉన్నవారు ఎక్కువ నిధులు మంజూరు చేసి తండాలను అభివృద్ధి చేయాలే తప్ప మంజూరైన నిధులను రద్దు చేయించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇదే విషయాన్ని మంజూరైన తండాలకు వెళ్లి తండా వాసులకు చెబుతామని అన్నారు. త్వరలోనే రాష్ట్ర మంత్రులను కలిసి తిరిగి రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరనున్నాట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నహీం, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేష్ ప్రసాద్, మానయ్య తదితరులు ఉన్నారు.


Similar News