State Govt : రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం..
పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి : పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబీవీపీ జిల్లా కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న విద్యాశాఖకు 6.5 శాతం మాత్రమే నిధులు కేటాయించడం విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు.
మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రూ.7800 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో పేద విద్యార్థులు చదువుకు దూరంగా కావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిత్య , పవన్, నగర కార్యదర్శులు పరశురాం, రాహుల్, ఫణీంద్ర, సంతోష్, జస్వంత్, భాను, రాజు, రాకేష్, గోవర్ధన్, అక్షిత్, సంజయ్, భీమన్న, ప్రణయ్, విద్యార్థులు పాల్గొన్నారు.