Andole: జోగిపేటలో ముగ్గురు కౌన్సిలర్ల సంచలన నిర్ణయం.. దెబ్బతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి

అందోల్–జోగిపేట మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది...

Update: 2023-11-08 05:01 GMT

దిశ, అందోల్‌: అందోల్–జోగిపేట మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఒకే సారి 12,14,20 వార్డులకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కోరబోయిన నాగరాజు, పి. దుర్గేష్, చందర్‌ నాయక్‌ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటన చేయడంతో బీఆర్‌ఎస్‌ పార్టీలో కొందరు నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీలో గందరగొళ పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే ఈ విషయాన్ని దిశ దిన పత్రిక ముందే చెప్పింది. గత కొంత కాలంగా వీరు అసంతృప్తితో ఉన్నా, వారిని నచ్చజేప్పే ప్రయత్నాలు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చేయకపోవడంతోనే వారు ఆసహనానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఒక్కసారిగా ప్రెస్‌ మీట్‌ పెట్టి ప్రకటించిన వెంటనే ఆ ముగ్గురి కౌన్సిలర్లకు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇంచార్జీ ఫారుక్‌ హూస్సెన్‌తో సహా నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఫోన్‌ల మీద ఫోన్‌లు చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికార పార్టీ కౌన్సిలర్లు రాజీనామా విషయం నియోజకవర్గ వ్యాప్తంగా చ ర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్‌ఎస్‌ పార్టీని వీడుతుండడం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో సహా ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే చెప్పవచ్చు.

పార్టీలో చేరినప్పటి నుంచి చిన్నచూపే: కొరబోయిన నాగరాజ్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ టిక్కెట్‌ ఇస్తామని చెప్పి, పార్టీలో చేర్చుకుని ఇవ్వకుండా మోసం చేశారని 12వ వార్డు కౌన్సిలర్‌ కొరబోయిన నాగరాజ్‌ అన్నారు. రెబల్‌గా పోటీ చేసి గెలుపొందిన తర్వాత వార్డు అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ హామీనివ్వడంతో బీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. పార్టీలో చేరిన నాటి నుంచి ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య ఏనాడు పట్టించుకొలేదని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్నో పర్యాయాలు అవమానాలు ఎదురైనా తాను వార్డు అభివృద్ది కోసమే ఆ పార్టీలో పనిచేశానని, వారిలో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు. అవమానాలను భరించలేక, వార్డులో ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చేందుకు పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 8న కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదు: పి.దుర్గేష్‌

మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికైన తర్వాత వార్డులో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన బిల్లులను ఇప్పటివరకు నయా పైసా ఇవ్వలేదని 14వ వార్డు కౌన్సిలర్‌ పి.దుర్గేష్‌ అన్నారు. చైర్మన్‌తో పాటు మిగతా వారి పనుల బిల్లులు మాత్రం సజావుగా అందించారన్నారు. వార్డులో అభివృద్ది పనులను చేపట్టే విషయం, బిల్లుల చెల్లింపుల విషయాలపై పలుమార్లు ఎమ్మెల్యేకు విన్నవించిన పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని కూడా ఎమ్మెల్యేకు చెప్పిన వినిపించుకొలేదన్నారు.

అభివృద్ధిని అడిగితే కక్ష్యసాధింపులు: చందర్‌ నాయక్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందిన నాటి నుంచి అనేక అవమానాలకు గురయ్యానని 20వ వార్డు కౌన్సిలర్‌ చందర్‌నాయక్‌ ఆవేదనను వ్యక్తం చేశారు. వార్డు అభివృద్ధి కోసం ఎన్నోసార్లు మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌లకు చెప్పిన వినిపించుకొలేదన్నారు. తాను ప్రశ్నించిన సందర్బాల్లో తమ కుటుంబ సభ్యులపై కక్ష్యసాధింపులకు గురిచేశారని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహతోనే అభివృద్ది సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.

Tags:    

Similar News