ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్ట్ చేయాలి: కాశెట్టి పాండు

వేలాది మంది యువకులు, విద్యార్థులు, ఉద్యోగుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని....BJP Leader Pandi Serious on MLC Kavitha

Update: 2022-12-10 13:39 GMT

దిశ, చేర్యాల: వేలాది మంది యువకులు, విద్యార్థులు, ఉద్యోగుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో మద్యం వ్యాపారానికి తాకట్టు పెట్టిన కల్వకుంట్ల కుటుంబానికి చమరగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్రురాలుగా సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు దేశవ్యాప్తంగా తెలంగాణ గౌరవాన్ని దిగజార్చింది. అందుకు గాను కవితను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కాశేట్టి పాండు డిమాండ్ చేశారు.

శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాండు మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మంట కలిపే విధంగా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంలో పాత్ర పోషించడం బాధాకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణ పేరు చెబుతూ కుంభకోణాలు, కమీషన్ల తెలంగాణగా మార్చేశారన్నారు. కమీషన్లు లేనిదే ఏ పథకం ఈ రాష్ట్రంలో లేదన్నారు. తెలంగాణ సంపదలను కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది చాలదని, దేశ సంపదను దోచుకునే ప్రయత్నంలో కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణానికి ఒడిగట్టిందన్నారు.

దేశ సంపదను దోచుకోవడానికే టీఆర్ఎస్ ను బీఅర్ఎస్ గా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బేషరతుగా ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా పార్టీ నుంచి కూడా బహిష్కరించాలన్నారు. మద్యంమత్తులో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మహిళల పుస్తెల తాకట్టుకు కారణమవుతున్న బీఆర్ఎస్ పార్టీని పాతరేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎమ్మెల్సీ కవితను బర్తరఫ్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత మేలుకొనాలని లేకపోతే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదురుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్రం కల్వకుంట్ల కబందాస్తాల నుంచి విముక్తికై పోరాడుతున్న భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం, కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News