రోగులకు మెరుగైన సేవలు అందించాలి : జహీరాబాద్ ఎమ్మెల్యే

ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని

Update: 2024-11-06 15:49 GMT

దిశ, ఝరాసంగం : ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సూచించారు. బుధవారం ఝరాసంగం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం రిజిస్టర్ లను పరిశీలించి సిబ్బంది పనితీరును మండల వైద్యాధికారి రమ్యను మాట్లాడి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న సేవలను అందిస్తున్న,మందుల వివరాలను ఆయన వాకబు చేశారు. సిబ్బంది కొరత ఉన్నట్లయితే డిప్యూటేషన్ కై పై అధికారులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఉన్న సిబ్బంది గైర్హాజర్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ వైద్యానికి దీటుగా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ తనిఖీలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్,బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Similar News