రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని , గ్రామపంచాయతీని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

Update: 2024-08-31 09:47 GMT

దిశ,కొల్చారం : కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని , గ్రామపంచాయతీని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వచ్చిన సమయంలో ఆసుపత్రిలో హాయ్ విభాగం వైద్యులు డాక్టర్ హర్ష , ఫార్మసిస్టు రజిత, ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్ లు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

    వారికి అందజేస్తున్న చికిత్స వివరాలను సిబ్బంది కలెక్టర్​ వివరించారు. ఆస్పత్రిలోని ఫార్మసీ గదిని పరిశీలించి ఆసుపత్రిలో నిల్వ ఉన్న మందుల వివరాలను ఫార్మసిస్టును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వాసుపత్రులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు రక్తహీనత రాకుండా ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్లు సిరప్ లు ఇవ్వాలని, పిల్లల ఎదుగుదల ఉండేలా మంచి ఆహారం ఇచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం

కొల్చారం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని, గ్రామంలోని వీధులను శనివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి వీధి తిరిగి కలెక్టర్ నీరు నిల్వ ఉండే ప్రాంతాలను పరిశీలించారు. మసీదు సమీపంలో రోడ్డు పక్కనే చెత్త వేయడం పట్ల మందలించారు. ప్రధాన వీధిలో రోడ్డు పక్కనే ఉన్న ఇంటి ముందు కుండి లో నీరు నిల్వ ఉండడం, నీటిలో దోమల లార్వాలు ఉండడంపై కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి అంజయ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

     గ్రామంలో రోజూ తిరుగుతావా లేదా అని ప్రశ్నించారు. కొల్చారం గ్రామంలో పారిశుధ్య సమస్య పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంలేదని గ్రామస్తులు కలెక్టర్ కి తెలిపారు. నాయిని జలాల్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి గ్రామంలో సమస్య ఉందని రోడ్లపై మురుగునీరు పాడుతుందని, తాగునీరు కలుషితం అవుతుందని, పంచాయతీ కార్యదర్శి గ్రామంలో రోడ్లపై పిచ్చి మొక్కలు తొలగించేందుకు గడ్డి మందు స్ప్రే చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని అన్నారు. దాంతో వెంటనే సంబంధిత పంచాయతీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని ఎంపీడీవో కృష్ణవేణికి కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గౌస్ మియా, ఎంపీడీవో కృష్ణవేణి, ఎంపీహెచ్ఈఓ మదన్మోహన్ ,ఫార్మసిస్ట్ సరిత, పంచాయతీ కార్యదర్శి అంజయ్య పాల్గొన్నారు. 

Tags:    

Similar News