బాబోయ్ పులి.. భయంతో వణుకుతున్న రైతులు..

పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కే వెంకటాపురం గ్రామంలో గత రాత్రి పులిదాడిలో దూడ మృతి చెందింది.

Update: 2023-03-27 17:01 GMT

దిశ, పెద్ద శంకరంపేట్: పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కే వెంకటాపురం గ్రామంలో గత రాత్రి పులిదాడిలో దూడ మృతి చెందింది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు కమ్మరి సాయిలు ఆదివారం రాత్రి పశువులను తన పొలంలో కట్టేసి ఇంటికి వెళ్ళాడు. ఉదయం వెళ్లి చూడగా దూడను కట్టేసిన చోట తల మాత్రమే మిగిలి ఉంది.
వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయగా పులి పాదాల అచ్చు ఆనవాళ్లను అటవి శాఖ అధికారి ప్రవీణ్ సిబ్బందితో వచ్చి నిర్ధారించారు.. కాగా కొంతమంది రైతులకు గుట్టలపై పులి కనిపించడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. పులి జాడ తెలిసే వరకు రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. 

Tags:    

Similar News