బిఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా..?

నాయకులు నియోజకవర్గంలో రియల్‌ఎస్టేట్‌ వసూళ్ళకు పాల్పడి నేడు జరుగుతున్న అభివద్ధిని ఓర్వలేక అడ్డంకులు సష్టిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి ఆరోపించారు.

Update: 2025-01-02 15:54 GMT

దిశ, నారాయణఖేడ్‌: నాయకులు నియోజకవర్గంలో రియల్‌ఎస్టేట్‌ వసూళ్ళకు పాల్పడి నేడు జరుగుతున్న అభివద్ధిని ఓర్వలేక అడ్డంకులు సష్టిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి ఆరోపించారు. నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లిటిగేషన్‌ ఉన్న భూములను పోలీసులతో భయబ్రాంతులకు గురిచేసి కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నీమ్స్‌బోరో, జనతా ఎస్టేట్‌ తదితర ఫార్మ్‌ల్యాండ్స్‌తో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇతరులకు లేని భూములు ఫార్మ్‌ల్యాడ్స్‌పేర రిజిస్ట్రేషన్లు చేయించి మోసం చేశారని అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుల అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్దమని సవాల్‌ విసిరారు. ఒకనాడు ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డొక్కు స్కూటర్‌పై పెట్రోల్‌ లేకుండా ఇబ్బందులు పడుతూ తిరిగేవాడని పేర్కొన్నారు.

మార్కెట్‌ కమిటీ పదవికోసం రూ.13లక్షలకు అమ్ముకున్నాడని, అతని సతీమణి పేర వాహనం కొనుగోలు చేసిన విషయం నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని అన్నారు. నేడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తుంటే చూసి ఓర్వలేక అడ్డంకులు సృష్టిస్తూ అసత్య ఆరోపణలతో పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్య, వైద్యం పదేళ్ల కాలంలో నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పేద రైతులు ట్రాన్స్‌ఫార్మర్లకోసం డీడీలు కట్టినా ఆరేళ్లయిన ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక పేద రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు ఇప్పించినట్లు గుర్తు చేశారు. వెంచర్లకు స్తంబాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు వేసుకున్న ఘనత బీఆర్‌ఎస్‌ నాయకులదని అన్నారు. విద్యాభివద్ది కోసం ఇంటిగ్రేటెడ్‌ గురుకులాన్ని రూ. 200కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ ఐటీఐ, స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

ఆయా నిధుల కింద కోట్లతో రహదారులు నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. ఫైనాన్స్‌ మంజూరీ లేకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్నికల సమయంలో రోడ్లు, ఆయా పనుల జీవోలు కాగితాలపై తెచ్చారని, కాంట్రాక్టర్లు బిల్లులు రాక పారిపోయారని పేర్కొన్నారు. తాము ఏ పనులను రద్దు చేయించలేదని అన్నారు. ఆయా శాఖల వారీగా మంజూరు అయిన నిధులు, పనులను ఎమ్మెల్యే వివరించారు. అభివద్ధిని అడ్డుకుంటూ రాజకీయ లబ్దిపొందాలని యత్నిస్తే ప్రజలు తగురీతిలో బుద్దిచెబుతారని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు రమేష్‌ చౌహాన్, వినోద్‌పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.


Similar News