ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరణ

యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఈనెల 14 -12-2024 నుండి పది రోజుల పాటు గొర్రెల పెంపకం(Sheep Rearing),

Update: 2024-12-01 09:19 GMT

దిశ, సిద్దిపేట అర్బన్ : యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఈనెల 14 -12-2024 నుండి పది రోజుల పాటు గొర్రెల పెంపకం(Sheep Rearing), పుట్ట గొడుగుల తయారీ (Mashroom Cultivation) పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధిపేట రీజినల్ హెడ్ ఎద వికాస్, సంస్థ డైరెక్టర్ రాజ లింగం సంయుక్తంగా పత్రికా ప్రకటనలో తెలిపారు.ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో ఉచిత కోర్సు మెటీరియల్, యూనిఫాం, ఉదయం టిఫిన్, రెండు సార్లు టీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 10 రోజుల శిక్షణ తర్వాత సర్టిఫికెట్ ప్రధానం చేయబడును. అర్హత ఉన్న వారికి బ్యాంకు లోను కు సహకరిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగి ఉన్న సిద్దిపేట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్న పురుషులు/మహిళలు తమ

1)ఆధార్ కార్డు,

2)రేషన్ కార్డు,

3) 3 ఫోటోలు,

4)బ్యాంకు పాస్ బుక్, ఏదైనా చదువుకున్న ద్రువపత్రాలు

అన్ని జిరాక్స్ పత్రలు 10-12-2024 లోపు వీపంచి కళ నిలయం పక్కన, జిల్లా గ్రంథాలయం ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సిద్ధిపేట కార్యలయంలో నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9949 88 2026 ,9966 829 ౧౦౨ సంప్రదించగలరని తెలిపారు.


Similar News