భావితరాలకు స్ఫూర్తి ప్రదాత.. జ్యోతిరావు పూలే: ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు
చాతుర్య వర్ణ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కరణ వాది మహాత్మ జ్యోతరావు పూలే అని ఎమ్మెల్యే మాధవనేని రఘునదనరావు కొనియాడారు.
దిశ, దుబ్బాక: చాతుర్య వర్ణ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కరణ వాది మహాత్మ జ్యోతరావు పూలే అని ఎమ్మెల్యే మాధవనేని రఘునదనరావు కొనియాడారు. మంగళవారం పూలే జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం రాక ముందే స్త్రీ జనోద్దరణ, పేదల బతుకుల్లో మార్పు తీసకురావడానికి తన భార్య సావిత్రి బాయ్ పూలేకు చదువు నేర్పించి రాత్రి పూట బడులను పెట్టించిన మహనీయుడిని కొనియాడారు. పూలే దంపతులు నిస్వార్ధంగా, సమాజ హితం కోసం పాటుపడుతే నేటి సమాజంలో కొంత మంది ఓట్లు, వ్యక్తిగత అవసరాల కోసం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కపట ప్రేమకు తెరదిస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ నెల పవిత్రమైనదని ఈ నెలలోనే ప్రపంచం మెచ్చిన గొప్ప మానతావాదులు, నవ సమాజ నిర్మాతలైన పూలే, అంబేడ్కర్, జగ్జివన్ రామ్ మన దేశంలో పుట్టడం గొప్ప వరమన్నారు.
బీటీ రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి..
దుబ్బాక పట్టణంలో రూ.4కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే మాధవనేని రఘునదనరావు అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. మంగళవారం ఆయన బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. తుతూమంత్రంగా కాకుండా పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేశ్ గౌడ్, ఎస్.ఎన్ చారి, చింత సంతోష్, మచ్చ శ్రీనివాస్, పుట్ట వంశీ, సుంకోజి ప్రవీణ్, తొగుట రవి, రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.