వరద నీటికి తెగిపోయిన ప్రత్యామ్నాయ కల్వర్టులు

గత సంవత్సరం నుండి రహదారి మరమ్మతులు చేపట్టినప్పటికీ

Update: 2024-09-04 09:51 GMT

దిశ, నంగునూరు : గత సంవత్సరం నుండి రహదారి మరమ్మతులు చేపట్టినప్పటికీ సకాలంలో కల్వట్లు నిర్మించకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన కాల్వర్టులు భారీ వర్షాలకు తెగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంగునూరు మండల పరిధిలో ఉన్న సిద్దిపేట- హుస్నాబాద్ రహదారిపై ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన కల్వర్టులు భారీ వర్షాలకు తెగిపోయి రహదారి వెంట వాహనాలు నిలిచిపోయాయి. గత సంవత్సరం జాతీయ రహదారి మరమ్మతుల్లో భాగంగా మొండ్రాయి, పాలమాకుల, బద్దిపడగ, వద్ద పెద్ద ఎత్తున బ్రిడ్జిలను నిర్మించేందుకు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన రోడ్డు వర్షాలకు తెగిపోయింది. దీంతో నంగునూరు మండలం తో పాటు సిద్దిపేట నుంచి హనుమకొండ, హుస్నాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు గత నాలుగు రోజుల నుండి వాహనాలు నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుస్నాబాద్ వెళ్లాలంటే ఈ రహదారి కంటే వెళ్లాలి, కల్వట్ల వద్ద ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన రోడ్డు తేలిపోవడంతో భారీ వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది దీంతో దూరప్రాంతాల నుంచి వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్టర్లు సకాలంలో బ్రిడ్జిల నిర్మాణం చేసినట్లయితే ఈ ఇబ్బందులు ఉండేవి కాదని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జిల మరమ్మతులను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన రోడ్లు మరమ్మతులు చేపట్టి వాహనాలు వెళ్లే విధంగా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. బుస్సాపూర్ తిమ్మాయిపల్లి రోడ్డు మరమ్మతుల్లో భాగంగా సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలమాకుల వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ సకాలంలో నిర్మించకపోవడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఓబులాపూర్, గోనపల్లి, కస్తూరి పల్లి తదితర గ్రామాలకు వెళ్లాలంటే ఈ మార్గం ద్వారానే వెళ్లాలి. పాలమాకుల- ఓబులాపూర్ మధ్య నిర్మిస్తున్న మూడు బ్రిడ్జిలు సైతం సకాలంలో నిర్మించకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమని ప్రజల ఆరోపిస్తున్నారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన రోడ్లు తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించి మరమ్మతులు చేపట్టేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Similar News