ప్రేమ పేరుతో మోసం చేశాడని విద్యార్థిని ఆత్మహత్య

ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోమని కోరగా ముఖం చాటేయడంతో ఓ యువతి (21)బలవన్మరణానికి పాల్పడింది.

Update: 2024-03-13 16:41 GMT

దిశ, వర్గల్: ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోమని కోరగా ముఖం చాటేయడంతో ఓ యువతి (21)బలవన్మరణానికి పాల్పడింది. గౌరారం ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాలు.... తునికి ఖల్సా గ్రామానికి చెందిన ఓ యువతి తుర్కపల్లిలోని ఓ పరిశ్రమలో రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తుంది. ములుగు మండలం క్షీరసాగరకు చెందిన అభిషేక్ అనే యువకుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని యువతితో చెబుతూ తన వెంట తిరిగాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని యువతి కోరగా తమ ఇంట్లో ఒప్పుకోరని తప్పించుకుని తిరుగుతున్నాడు. నెలరోజుల క్రితం యువతి తన ఇంట్లో ఈ విషయం చెప్పుకుంటూ బాధపడుతూ ఒంటరిగా ఉంటుంది. యువతి కుటుంబ సభ్యులు యువకుడి కుటుంబ సభ్యులను పెళ్లి విషయం అడుగగా దుర్భాషలాడుతూ పంపారు. దీంతో మనస్తాపం చెందిన యువతి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివ కుమార్ తెలిపారు.


Similar News