సిద్దిపేట డెంటిస్ట్ కు అరుదైన గౌరవం
ట్టణానికి చెందిన దంత వైద్యుడు అరవింద్‌కుమార్ కు అరుదైన గుర్తింపు లభించింది. ఈ నెల 15 నుంచి 20 వరకు జరిగే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీకి సంబందించిన ఫైనల్ పరీక్షలో ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ గా డా. అరవింద్ కుమార్ కు సౌత్‌ఆఫ్రికాలోని మెడికల్ హెల్త్ సైన్స్ యూనివర్శిటీ ఆఫ్ రువాండా కళాశాల ప్రిన్సిపాల్ ప్రోఫెసర్ అబ్రహం ఆహ్వానం పంపించారు.
ఎం.హెచ్.ఎస్ యూనివర్సిటీ ఆఫ్ రువాండా కు ఎగ్జామినర్ గా డా.అరవింద్ కుమార్
అభినందనలు తెలిపిన మంత్రి హరీష్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: పట్టణానికి చెందిన దంత వైద్యుడు అరవింద్‌కుమార్ కు అరుదైన గుర్తింపు లభించింది. ఈ నెల 15 నుంచి 20 వరకు జరిగే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీకి సంబందించిన ఫైనల్ పరీక్షలో ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ గా డా. అరవింద్ కుమార్ కు సౌత్‌ఆఫ్రికాలోని మెడికల్ హెల్త్ సైన్స్ యూనివర్శిటీ ఆఫ్ రువాండా కళాశాల ప్రిన్సిపాల్ ప్రోఫెసర్ అబ్రహం ఆహ్వానం పంపించారు.
భారతదేశం తరపున డాక్టర్ అరవింద్‌కుమార్ పరీక్షలకు సంబంధించి క్లీనికల్, ల్యాబ్స్ నిర్వహణ, మూల్యాంకనం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి హెల్త్ ఆండ్ సైన్స్ యూనివర్సిటీ రువాండాకు డా.అరవింద్ కుమార్ వెళ్లడం పట్ల సిద్దిపేట వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయనను రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అభినందించారు. తెలంగాణ రాష్ట్రం కీర్తి గడించేలా ఆయన సేవలు మరిన్ని కొనసాగించాలని కోరారు.