కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణం
కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని చీకోడ్ గ్రామంలో శుక్ర వారం చోటుచేసుకుంది.
దిశ, పాపన్నపేట: కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని చీకోడ్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిన్ సంగమేశ్వర్, శ్రీలత దంపతుకు దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీలతను తన భర్త సంగమేశ్వర్, అత్త అనసూయ, మరిది సాయిబాబా కలిసి అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారు.
ఇదే విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఈనెల 20న రూ.4 లక్షలు ఇవ్వాలని డబ్బు కోసం భర్త సంగమేశ్వర్ కొడుతున్నాడంటూ శ్రీలత తన తండ్రి గోపాల్ కు తెలిపింది. దీంతో గోపాల్ తన భార్యను తీసుకొని పరిష్కారం కోసం శుక్రవారం తన కూతురి ఇంటికి వెళ్లాడు. సంగమేశ్వర్ మళ్లీ వారితో కూడా గొడవకు దిగాడు. గొడవ జరిగిన కొద్దిసేపటికి శ్రీలత తండ్రి తన కూతురిని వాళ్లింటికి తీసుకెళ్తానని అన్నాడు. అందుకు భర్త సంగమేశ్వర అంగీకరించలేదు. దీంతో శ్రీలత తల్లిదండ్రులు వాళ్లింటికి వెళ్లిపోయాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీలత శుక్ర వారం రాత్రి సమయంలో ఇంట్లో దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం కుటుంబీకులు గమనించి శ్రీలత తండ్రిదండ్రులకు సమాచారం అందజేశారు. శ్రీలత తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.