ఫ్రాంక్లిన్ EV ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

రాష్ట్రంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా శనివారం సాయంత్రం ఫ్రాంక్లిన్ EV ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2025-01-04 12:07 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా శనివారం సాయంత్రం ఫ్రాంక్లిన్ EV ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ(Electric Scooter Company)లో భారీ అగ్నిప్రమాదం(Massive fire accident) చోటు చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్-మేడిపల్లి(Medipalli) పోలీస్ స్టేషన్ పరిధిలో జరగ్గా.. గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బంది(Fire crew)కి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే EV ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ కావడంతో మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ బ్యాటరీలు భారీ శబ్దంతో పేతుతుండటం.. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.


Similar News