Chamala: బీఆర్ఎస్ నేతల మొరుగుడుతో ప్రజలు తప్పుదోవ.. కాంగ్రెస్ ఎంపీ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ నాయకుల మొరుగుడుతో ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్(Congress) ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) అన్నారు.

Update: 2025-01-06 12:12 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నాయకుల మొరుగుడుతో ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్(Congress) ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం(BRS Party Government) రూ. 85 వేల కోట్లు ఖర్చు చేస్తే.. తాము ఒక్క ఏడాదిలోనే రూ 53 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం రాష్ట్ర ప్రజలే చెప్పాలని అన్నారు. అలాగే బడా బాబులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకే కొండలు, గుట్టలకు రైతుబంధు వేసి వాళ్ళు రూ.20 వేల కోట్లు వృధా చేశారని ఆరోపించారు.

రైతుల కోసం, ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎంతో చేస్తున్నదని, కాంగ్రెస్ నాయకులు చేప్పుకోలేక పోతున్నామని, బీఆర్ఎస్ నాయకులు మొరుగుతున్నారని, ఆ మొరుగుడుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.  వరి వేస్తే ఉరి అని నిబంధనలు పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, రూ.20 వేల కోట్లు రోడ్లకు, పడావు పడ్డ భూములకు, బిల్డింగ్ లకు ఎందుకు ఇచ్చారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ప్రజలే కేటీఆర్ కు గుణపాఠం చెప్తారని, రూ.55 కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి పంపించిన కేటీఆర్ ను ఈడీ విచారణకు పిలిస్తే డ్రామాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్నీ హామీలను నెరవేర్చుతున్నదని చామల స్పష్టం చేశారు. 

Tags:    

Similar News