స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్‌కు మర్రి శశిధర్ రెడ్డి కీలక వినతి

ఒక కుటుంబంలో ఉన్నా ఓటర్లకు వేర్వేరు పోలింగ్ కేంద్రాలు కేటాయించడం వలన ఓటర్లు ఇబ్బదులకు గురవుతున్నారని తెలంగాణ బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి జాతీయ ఎన్నికల

Update: 2023-08-25 14:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక కుటుంబంలో ఉన్నా ఓటర్లకు వేర్వేరు పోలింగ్ కేంద్రాలు కేటాయించడం వలన ఓటర్లు ఇబ్బదులకు గురవుతున్నారని తెలంగాణ బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి జాతీయ ఎన్నికల కమిషన్ కమిటీ సభ్యులు, రిటైర్డ్ ఐఏఎస్ ఓం పాఠక్‌లు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్స్ ఒకే కుటుంబానికి సంబంధించిన వారికీ వివిధ పోలింగ్ స్టేషన్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారని.. సీఈఓ దృష్టికి తేవడం జరిగిందని తెలిపారు.

ఒకే కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరినీ ఒకే పోలింగ్ బూత్‌లోకి మార్చాలని తెలిపారు. అలాగే చనిపోయినటువంటి ఓటర్లను, షిఫ్ట్ అయిన ఓటర్స్‌ని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. సీఈఓను కలిసిన వారిలో కమిటీ సభ్యులు ఏడెల్లి అజయ్ కుమార్, పొన్న వెంకటరమణ, కెతినేని సరళ, కొల్లూరి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News