మనుభాకర్‌ సాధించిన మెడల్ దేశానికి ఎంతో ప్రత్యేకం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

పారిస్ ఒలిపింక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల పైనల్స్ లో భారత్ కు చెందిన మను భాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలించింది.

Update: 2024-07-28 14:59 GMT

దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలిపింక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల పైనల్స్ లో భారత్ కు చెందిన మను భాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలించింది. కాగా 2024 ఒలింపిక్స్‌లో భారత్ బోణీపై కొట్టడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పథకం సాధించిన మను భాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. షూటింగ్‌లో మెడల్ సాధించిన తొలి భారత మహిళ అని, ఈ మెడల్ దేశానికి ఎంతో ప్రత్యేకమని కిషన్ రెడ్డి కొనియాడారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలో రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటనపై కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్‌‌కు కేంద్ర మంత్రి ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భౌతికకాయం వీలైనంత త్వరగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి.. పెండింగ్లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్‌ను త్వరగా పూర్తిచేయడంలో చొరవతీసుకోవాలని ఢిల్లీలోని తన కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఆదేశించారు.


Similar News