BRS: రేవంత్ పాలన పట్టాలు తప్పిందనడానికి ఇదే నిదర్శనం.. హరీష్ రావు ట్వీట్

రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలన పట్టాలు తప్పిందనడానికి ఇదే నిదర్శనమని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత(BRS Leader) హరీష్ రావు(Harish Rao) అన్నారు.

Update: 2024-11-02 12:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలన పట్టాలు తప్పిందనడానికి ఇదే నిదర్శనమని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత(BRS Leader) హరీష్ రావు(Harish Rao) అన్నారు. హోంగార్డు(Home Gaurd)ల భార్యల(Wives)ను అరెస్ట్(Arest) చేయడంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. మొన్న టీజీఎస్పీ పోలీసు(TGSP Police)ల భార్యలు(Wives) రోడ్డెక్కితే, నేడు హోంగార్డుల భార్యలు రోడ్డెక్కారని తెలిపారు. అలాగే ఇచ్చిన హామీలను అమలు చేయాలని, హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని(Telangana Govt) నిలదీస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోలీసుల ఆందోళనలు(Police Protests), అడుగంటుతున్న శాంతిభద్రతలు నెలకొంటున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక హోం మంత్రి(Home Minister)గా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్టాలు తప్పిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాగా హోం గార్డుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, జీతాలు సమయానికి ఇవ్వాలని హోంగార్డుల భార్యలు ఇవాళ ధర్నాచౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News