శనివారం అర్థరాత్రి మరోసారి భయంపుట్టించిన మన్నేరు..
శనివారం అర్థరాత్రి మరోసారి భయంపుట్టించిన మన్నేరు..
దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం నగరం, రూరల్ మండల ప్రజలు శనివారం అర్థరాత్రి టెన్షన్..టెన్షన్ వాతావరణంలో జీవనం సాగించారు. మున్నేరు నది మళ్లీ ప్రజలను భయపెడుతోంది. అదికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. ఎగువ ప్రాంతాలైన మహబూబాబాద్, గార్ల ప్రాంతాల్లో శనివారం సాయంత్రం 182 మి.మీ వర్షపాతం నమోదవడంతో ఖమ్మం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. బయ్యారం చెరువు వీపరితంగా అలుగుపోయడంతో మున్నేరు వరదపోటేత్తింది. దీంతో ఖమ్మం లో మున్నేరు 15.75 ఫీట్లుగా నమోదైంది. మొదటి ప్రమాద హెచ్చరిక 16ఫీట్లు, రెండో ప్రమాద హెచ్చరికగా 24.00 ఫీట్లుగా జారీ చేస్తారు. ప్రస్తుతం మున్నేరు వరద తీవ్రత కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఖమ్మం శివారు ప్రాంతాలైన ధంసలాపురం న్యూ కాలనీ ప్రజలను అప్రమత్తం చేసి పునరవాస కేంద్రానికి తరలించారు. బంగాళాఖాతంలో అల్ఫపీడనం ప్రభావంతో మరో నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతవరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం రాత్రి హైద్రాబాద్ నుండి ఖమ్మంకు హుటాహుటిన వచ్చారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ఖమ్మం నగర వాసులను అప్రమత్తం చేసి వారి పునరవాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, కమిషనర్ అభిషేక్ అగస్త్యలను ఆదేశించారు.
రాత్రికి రాత్రే ఖమ్మం ఖాళీ..
శనివారం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటంతో వరద ప్రహహాంతో మున్నేరుకు వరద పోటేత్తడంతో అధికారులు, పోలీసులు ధంసలాపురం వాసులను, రూరల్ మండలంలోని జలగంనగర్, రాజీవ్‌గృహకల్ప కాలనీ, వికలాంగుల కాలనీ, టెంపుల్‌సిటీ కాలనీ వాసులను అలర్ట్ చేశారు. కలెక్టర్ సోషల్ మీడియాలో వరదల పై అప్రమత్తంగా ఉండాలని వాయిస్ మెసెజ్‌ను సైతం పంపారు. ఇంటింటికి తిరిగి వరద ముంపు పొంచి ఉందని ఏ క్షణమైనా వరద కాలనీల పై పడే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ప్రజలు పరుగులు తీశారు.మున్నేరుకు వరద పోటు ప్రమాదం ఉందని జిల్లా అధికారులు ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయడంలో సక్సెస్ అయ్యారు.
మాముల పరిస్థితి ఎప్పుడు వస్తుందో..
మున్నేరు పరివాహక ప్రాంతాల్లో మాములు పరిస్థితి ఎప్పుడు వస్తుందో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరద ప్రవాహాంతో కాలనీలు బురదమయ్యాయి. వాటిన ఇరు నియోజకవర్గాలకు చెందిన మంత్రులు పొంగులేటి, తుమ్మలలు గత వారం రోజులుగా యుద్ధప్రాతిదికన శానిటేషన్ పనులు చేపడుతున్నారు. శనివారం మరోసారి వర్షం పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు లక్షల వరకు నష్టం జరిగిందని, మరోసారి ఇండ్లలోకి వరద వస్తే తాము పూర్తిగా నష్టపోతామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.