CM కేసీఆర్ టైమ్ అయిపోయింది.. మరో ఐదు నెలలే పవర్: మాణిక్ రావు ఠాక్రే
కేసీఆర్ టైమ్ అయిపోయిందని, కేవలం ఐదు నెలలే ఆయన ప్రభుత్వం నడుస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ టైమ్ అయిపోయిందని, కేవలం ఐదు నెలలే ఆయన ప్రభుత్వం నడుస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ యూత్క్విజ్కాంపిటేషన్పోస్టర్ను రిలీజ్చేశారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సర్కార్ తప్పిదాలన్నింటిని బయటకు తీస్తామని పేర్కొన్నారు.
పీసీసీ చీఫ్రేవంత్ మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ సర్కార్ అరాచకాలను ప్రజలు భరించలేకపోతున్నారన్నారు. రెండు సార్లు అవకాశం ఇచ్చినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రగతిభవన్‌నుంచి బయటకు తీసుకువస్తామన్నారు.
ఫిషరీస్చైర్మన్మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్హస్తం గుర్తుతో కార్గుర్తు టైర్లు, అద్దాలు పగిలిపోతాయని విమర్శించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్గవర్నమెంట్ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్సీనియర్ లీడర్మధుయాష్కీ గౌడ్తదితరులు పాల్గొన్నారు.
Also Read..
వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ