రేవంత్ రెడ్డిపై దాడి BRS దిక్కుమాలిన పాలనకు నిదర్శనం: థాక్రే
హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభపై బీఆర్ఎస్ శ్రేణలు జరిపిన దాడిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు థాక్రే తీవ్రంగా ఖండించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభపై బీఆర్ఎస్ శ్రేణలు జరిపిన దాడిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు థాక్రే తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన బీఆర్ఎస్ దిక్కుమాలిన పాలనకు మరో నిదర్శనం అని మండిపడ్డారు. బుధవారం సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయిన థాక్రే.. ప్రజాస్వామ్యం పట్ల బీఆర్ఎస్ నిర్లక్ష్యానికి ఇది నిరూపణ అన్నారు. భౌతిక దాడులు ఎంత వరకు న్యాయం అని నిలదీసిన ఆయన.. దాడులు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కాగా, రేవంత్ రెడ్డి సభలో దాడిపై కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. అధికార మదంతో బీఆర్ఎస్ నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపడుతున్నారు.