Mandakrishna Madiga: మాకు 9 కాదు 11 శాతం దక్కాలి.. వర్గీకరణపై మందకృష్ణ మాదిగ రియాక్షన్

ఈనెల 7న తలపెట్టిన 'లక్ష డప్పులు, వెయ్యి గొంతులు' వాయిదా పడింది.

Update: 2025-02-05 09:08 GMT
Mandakrishna Madiga: మాకు 9 కాదు 11 శాతం  దక్కాలి.. వర్గీకరణపై మందకృష్ణ మాదిగ  రియాక్షన్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్సీ వర్గీకరణ (SC Classification) రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఆరోపించారు. వర్గీకరణలో తమకు రావాల్సిన వాటా కంటే 2 శాతం తక్కువ రిజర్వేషన్లు వచ్చాయని ఆరోపించారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రిజర్వేషన్ల పంపిణీలోని లోపాలను సరిద్దిద్ది ముందుకు వెళ్లాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయనమాదిగల జనాభాకు తగినట్లుగానే రిజర్వేషన్ల వాటా ఉండాలని ఏ ప్రాతిపదిక తీసుకున్నా మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాలి. కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో తమకు 9 శాతమే దక్కుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 7వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో (MRPS) హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన 'లక్ష డప్పులు, వెయ్యి గొంతులు' కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కార్యక్రమం స్థానంలో 15 రోజుల తర్వాత సాంస్కృతిక మహోత్సవంగా నిర్వహిస్తామని తెలిపారు.

Tags:    

Similar News