‘బీజేపీ మెప్పు కోసం మంద కృష్ణ తాపత్రయం’

Update: 2024-10-04 15:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ మెప్పు కోసమే మంద కృష్ణ తాపత్రయం పడుతున్నాడని కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం మండిపడ్డారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ..మంద కృష్ణ మాదిగ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓ కమిటీ వేశారని, త్వరలో మరో జ్యుడీషియల్ కమిటీ వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. అయినప్పటికీ మంద కృష్ణ బీజేపీకి మైలేజ్ వచ్చేలా వ్యాఖ్యలు చేస్తూ, కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. గతంలో మంద కృష్ణ మాదిగ మద్దతు ఇచ్చిన సీఎం లు, సుప్రీం కోర్టులో అడ్వైకెట్లను ఎందుకు పెట్టలేదో? తెలుసుకోవాలని సూచించారు.

వర్గీకరణ జరగాలి అని స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చెప్పారని గుర్తు చేశారు. కొప్పుల రాజు వర్గీకరణ ను ఎన్నడూ వ్యతిరేకించలేదన్నారు. 2017 నుంచి బీజేపీ కి మద్దతుగా మంద కృష్ణ వ్యవహరిస్తున్నాడన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అయ్యాక, కేంద్రం ఎందుకు కోటిఫై చేయలేదనేది మంద కృష్ణ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ ప్రాసెస్ ను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మంద కృష్ణ తీసుకోవాలని సూచించారు. ప్రజలను కన్​ఫ్యూజ్ చేసేందుకు నిత్యం ఓ కొత్త రాగం ఎత్తుకోవడం బంద్ పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News