ఆఁ.. బుస్సు.. డబ్బులు ఇస్తే చెబుతా.. తెలంగాణ పాలిటిక్స్‌పై మంచు లక్ష్మి హాట్ కామెంట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును సద్వియోగం చేసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును సద్వియోగం చేసుకున్నారు. మంచు లక్ష్మీ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి, మార్పు, కొత్త వారికి ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేస్తే.. అంతిమంగా ప్రజలకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారని మంచు లక్ష్మిని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘మీ మనసుకు ఎవరూ కరెక్ట్ అనిపిస్తే వాళ్లకు ఓటు వేయండి. మీ ఊరికి, మీ ప్రాంతానికి ఎవరూ వస్తే మీకు మంచి జరుగుతుందని భావిస్తారో వారికి ఓటు వేసి గెలిపించండి. మనం ముందు చూపుతో అడుగువేస్తున్నామనేది ఈ ఓటు వేయడం అనేది. కాబట్టి ఈ బాధ్యతను ఎవరూ తక్కువగా తీసుకోవద్దు. హాలిడే అని చెప్పి ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోడం అనేది ఈ దేశానికి హానికరం. మనం ఒక దేశంగా ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాం. మనం ఇంకా ముందుకు వెళ్లాలి, అభివృద్ధి చెందాలి అంటే మనం ఓటు వేయాలన్నారు.
మార్పు కావాలి అనుకుంటున్నారా అని అడగ్గా.. ‘మార్పు కావాలని అందరూ అనుకుంటారు. ఎప్పుడు ఒకేలా ఉండాలని ఎవరు అనుకోరు. ఇప్పటి వరకు ఉన్న వాళ్లల్లో మంచి చేసిన వాళ్లు ఉన్నారు. వచ్చే వాళ్లు ఎలా చేస్తారో తెలియదు. కానీ ఏది ఏమైనా ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అందరి కళ్లు మన రాష్ట్రం మీదే ఉన్నాయి. కాబట్టి అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఓటు వేయండి.
ఫైనల్‌గా యువత ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకు అని ప్రశ్నించగా.. ‘నేను వచ్చాను కదా. నేను కూడా యంగే’ అంటూ నవ్వించింది లక్ష్మీ. ఇక యువత ఎందుకు ఓట్లు వెయ్యడానికి రాలేదు అంటే అది నాకు ఎలా తెలుస్తోంది. కానీ, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోవాలి. మీరు ఇంట్లో పడుకున్నది చాలు. ఇంకా చాలా టైం ఉంది. లేచి వచ్చి ఓటు వెయ్యండి. నేను వేరే ఊరి నుంచి వచ్చి.. డైరెక్ట్‌గా ఎయిర్ పోర్ట్ నుంచి ఓటు వెయ్యడానికి వచ్చాను. అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ. ఇక ప్రస్తుతం ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి కదా.. ఎవరు వస్తారు అనుకుంటున్నారు అని అడగ్గా.. ‘నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. ఎవరు విన్ అవుతారో చెప్తాను’ అంటూ ఫన్నీగా రియాక్ట్ అయింది లక్ష్మీ.