పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం.. స్పందించిన మాలోత్ కవిత
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కొందరు ప్రకటిస్తుండగా.. ఏకంగా రాజీనామాలు చేస్తూ మరికొందరు షాకిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కొందరు ప్రకటిస్తుండగా.. ఏకంగా రాజీనామాలు చేస్తూ మరికొందరు షాకిస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత కూడా పోటీ నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా.. ఈ ప్రచారంపై ఆమె స్పందించారు. శుక్రవారం ఉదయం కవిత మీడియాతో మాట్లాడుతూ.. తనపై జరుగుతన్న ప్రచారమంతా అవాస్తవమని కొట్టిపారేశారు. తానంటే గిట్టని వారే ఈ ప్రచారానికి తెరలేపారని అనుమానం వ్యక్తం చేశారు. తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్ట చేశారు. అంతేకాదు.. కేసీఆర్ ఆశీస్సులతో తప్పకుండా మహబూబాబాద్ నుంచి గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.