కేటీఆర్, హరీష్ రావులు పద్ధతి మార్చుకోవాలి.. మల్లు రవి మాస్ వార్నింగ్!

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు వారి పద్ధతి మార్చుకోవాలని ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి హెచ్చరించారు.

Update: 2024-01-29 09:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు వారి పద్ధతి మార్చుకోవాలని ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి హెచ్చరించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు అంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలు ఆయన అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. ప్రజలు తీర్పు ఇస్తే ప్రజాస్వామ్యబద్దంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యి రాష్ట్రంలో విప్లవాత్మక పాలన చేస్తున్నారన్నారు.

ప్రజారంజకంగా, ప్రజా పాలన చేస్తూ ప్రజల మనసులలో స్థానం సంపాదించారని కొనియాడారు. ప్రజాభిమానంతో సీఎంగా పని చేస్తున్న ముఖ్యమంత్రిపై కేటీఆర్ ఇలా అనుచితంగా మాట్లాడటం ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు. హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హుందాతనం లేదని అనడం ఆయన అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ ప్రజాపాలన చేస్తూ హుందాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని ఇలా అనడం పద్ధతి కాదన్నారు.

Tags:    

Similar News