రేపే వైఎస్ షర్మిల కొడుకు రిసెప్షన్.. హాజరు కానున్న ఖర్గే, కేసీ

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌లు శనివారం హైదరాబాద్‌కు రానున్నారు.

Update: 2024-02-23 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌లు శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఏపీ పీసీసీ చీఫ్​షర్మిల కొడుకు రిసెప్షన్‌కు హాజరు కానున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఈ రిసెప్షన్‌కు రానున్నారు. అయితే ఇరు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలతో ఖర్గే, కేసీలు ప్రత్యేకంగా భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నది.

వేర్వేరుగా తెలంగాణ, ఏపీ నేతలతో డిస్కషన్స్ చేయనున్నారు. ప్రస్తుత పార్టీ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలు నేపథ్యంలో సలహాలు, సూచనలు అందించనున్నారు. ఇక తెలంగాణలో ఎంపీ అభ్యర్ధుల ఎంపిక పై ఖర్గే, కేసీలు సీఎంతో పాటు కేబినేట్ మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నది. త్వరలోనే తెలంగాణలో ఎంపీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించేందుకు తగిన కార్యచరణను కేసీ పార్టీ నేతలకు వివరించనున్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..