మల్కాజిగిరి ఎంపీ స్థానం ఆ పార్టీదే విజయం! తేల్చేసిన ప్రముఖ సంస్థ సర్వే రిపోర్ట్..

దేశంలోనే అతి పెద్ద లోక్ సభ స్థానం అయిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజవర్గం ఈ ఎంపీ ఎన్నికల్లో హాట్ సీట్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నాయి.

Update: 2024-03-14 08:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే అతి పెద్ద లోక్ సభ స్థానం అయిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజవర్గం ఈ ఎంపీ ఎన్నికల్లో హాట్ సీట్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నాయి. మల్కాజిగిరిలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అనేది అందరికీ ఆసక్తిగా మారింది. ఈ స్థానంలో బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్న ఈటల రాజేందర్‌కే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలింది. ఈ క్రమంలోనే జన్‌లోక్ పోల్ సర్వే- 2024 ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

జన్ లోక్ పోల్ సర్వే వివరాలు చూస్తే..

మల్కాజిగిరిలో పార్లమంట్ స్థానంలో ఈటెల రాజెందర్‌ గెలుపొందే అవకాశాలు ఉన్నాయని జన్ లోక్ పోల్ సర్వేలో తేలింది. బీజేపీ - 37.38%, కాంగ్రెస్- 35.38%, బీఆర్ఎస్- 24.93%, ఇతరులు - 2.50% ఓట్లు పార్టీలు గెలుపొందే అవకాశం ఉందని సర్వేలో తెలిపింది. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న శంభీపూర్ రాజును మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ భరిలో దింపుతుంది. బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పోటీలో దించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ఇంకా పెండింగ్‌లోనే పెట్టింది.

ప్రధానిగా రాహుల్ గాంధీ కంటే మోడీనే బెటర్

దేశంలోనే వివిధ రాష్ట్రాల వారు ఈ మల్కాజిగిరి నియోజకవర్గంలో నివాసముంటారు. దీంతో ఇక్కడ ప్రధాని మోడీ చరిష్మా ఎక్కువగా ఉంటుందని పొలిటికల్ విశ్లేశకులు చెబుతున్నారు. ఈటల తెలంగాణలో సీనియర్ నాయకుడు మరోవైపు ఈ మోడీ చరిష్మా ఈటలకు ప్లస్ అవుతుందని, ఈ క్రమంలోనే విజయం వైపు దూసుకుపోతారనే టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రధానిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే మోడీనే బెటర్ అని న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ సర్వేలో తేలింది. మొత్తం 21 రాష్ట్రాల్లో 518 లోక్‌సభ స్థానాల్లో ప్రజాభిప్రాయం ప్రకారం చూసుకుంటే మరోసారి నరేంద్ర మోదీని ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లుగా సర్వేలో తేలింది.

ఈటలకు మరింత ప్లస్

ఇటీవల హుజురాబాద్, గజ్వేల్ రెండు స్థానాల్లో ఈటల పరాజయం పాలయ్యారు. దీంతో ఈ సారి ఖచ్చితంగా విజయం సాధించాలని మల్కాజిగిరిలో ఈటల వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు ప్రధాని మోడీ మల్కాజిగిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి వరకు 1.3 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోతో ఈటలకు మరింత ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 16న (శనివారం) నాగర్‌కర్నూల్‌లో మోడీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 18న జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

Tags:    

Similar News