Mahesh Kumar Goud: పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్.. పీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదే

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మె్ల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి (Chinna Reddy) సస్పెన్షన్ ఆర్డర్స్ (Suspension Orders) జారీ చేశారు.

Update: 2025-03-01 07:50 GMT
Mahesh Kumar Goud: పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్.. పీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదే
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి (Chinna Reddy) సస్పెన్షన్ ఆర్డర్స్ (Suspension Orders) జారీ చేశారు. అయితే, ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) స్పందించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ (AICC)నే నిర్ణయం తీసుకుందని అన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదేశాల మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని క్లారిటీ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యహరించే వారికి ఇది ఒక హెచ్చరిక అంటూ నాయకులు, కార్యకర్తలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఎవరైనా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. 

Tags:    

Similar News