చిన్నారికి Mahesh Babu చేయూత

అదిలాబాద్ జిల్లాకు చెందిన 10 నెలల చిన్నారి గుండె చికిత్సకు సినీ హీరో మహేష్ బాబు చేయూతనందించారు.

Update: 2022-12-02 04:10 GMT

దిశ ప్రతినిధి, అదిలాబాద్: అదిలాబాద్ జిల్లాకు చెందిన 10 నెలల చిన్నారి గుండె చికిత్సకు సినీ హీరో మహేష్ బాబు చేయూతనందించారు. జైనథ్ మండలం గూడ సిరిసన్న గ్రామానికి చెందిన 10 నెలల పాప కనకాల వర్ష పుట్టుకతో గుండె సంబంధించిన వ్యాధి‌తో బాధపడుతోంది. కటిక పేదరికం కావడంతో దాతల సాయం కోసం ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ హీరో మహేష్ బాబు తన ప్యూర్ లిటిల్ ఆర్ట్స్ ఫౌండేషన్ ద్వారా రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News