కేసీఆర్‌పై మహారాష్ట్ర నేతల ఆవేదన.. గులాబీ బాస్‌కు ఆడియో రూపంలో మెసేజ్
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు గులాబీ బాస్ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారు. ‘అబ్ కీ బార్ కిసార్’ అనే నినాదంతో తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు గులాబీ బాస్ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్‌ను ప్రారంభించారు. ముఖ్యంగా మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే నాందేడ్, ఔరంగబాద్ జిల్లాలపై గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఏరియాల్లో బీఆర్ఎస్ పార్టీని గ్రౌండ్ లెవల్‌లో స్ట్రాంగ్ చేసేందుకు ఇతర పార్టీలకు చెందిన నేతలను గులాబీ పార్టీలో చేర్చుకున్నారు. నాందేడ్, ఔరంగబాద్‌లో భారీ బహిరంగ సభలు సైతం నిర్వహించారు. బీఆర్ఎస్‌కు అధికారమిస్తే మహారాష్ట్రను కూడా తెలంగాణ మోడల్‌గా మారుస్తామని, ఏండ్లుగా మహారాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతోన్న తాగు, సాగు నీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ పిలుపు మేరకు మహారాష్ట్రలో ప్రధాన పార్టీలైన ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీని విస్తరించేందుకు కమిటీలను సైతం వేశారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్‌చార్జ్‌గా ఆయన ఫ్యామిలీకే చెందిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావును నియమించారు. ఇక్కడికి వరకు అంతా బాగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ ప్లాన్ బెడిసికొట్టింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కేసీఆర్ డైలామాలో పడిపోయారు. ఇదిలా ఉండగానే కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్‌లో ప్రమాదవశాత్తూ కింద పడటంతో తుంటి ఎముక విరిగింది. వైద్యులు సర్జరీ చేసే విజయవంతంగా హిల్ రిప్లేస్‌మెంట్ చేయడంతో ఆయన ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, గాయం కారణంగా కేసీఆర్ సైలెంట్‌గా ఉండటంతో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ అపాయిట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. కనీసం వారు ఫోన్ చేసిన స్పందించడం లేదని సమాచారం. తెలంగాణలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ ఎక్కడిక్కకడ పూర్తిగా నిలిచిపోయాయి. పార్లమెంట్ఎన్నికలు సమీపిస్తోన్న ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడంతో ఇతర రాష్ట్రాల్లోని బీఆర్ఎస్ శ్రేణులు పక్క పార్టీలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఓడిషా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం కొందరు పార్టీ మారారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ఓ బీఆర్ఎస్ నేత హై కమాండ్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
‘‘మహారాష్ట్రలో పార్టీ విస్తరిస్తామని తమను పార్టీలో చేర్చకున్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ పాలన తీసుకువస్తామన్నారు. కమిటీలను ఏర్పాటు చేశారు. మీ మాటలు నమ్మి ఇతర పార్టీల నుండి మేం బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాం. పార్టీ విస్తరణకు పగలు రాత్రిళ్లు కష్టపడ్డాం. మహారాష్ట్రలో అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తోన్న ఎలాంటి కార్యచరణ చేపట్టడం లేదు. ఇప్పుడు మేం ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తమకు అసలు మిమ్మల్ని కలిసే అవకాశమే ఇవ్వడం లేదు. కనీసం మా ఫోన్‌లు కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇదేనా మీ పార్టీ పద్దతి. మీరు కలిసే అవకాశం ఇవ్వడం లేదు.. ఫోన్ చేసిన ఆన్సర్ చేయడకపోవడంతో మేసేజ్ పెడుతున్నాం. ఈ మేసేజ్‌కు రిప్లే ఇవ్వాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరీ.