అవును..చిరుత పులిది సహజ మరణమే..
గత నెల 9వ తేదీన కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అమరగిరి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిరుత పులి సహజ మరణంతోనే మృతి చెందినట్లు స్థానిక ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ వెల్లడించారు.
దిశ, కొల్లాపూర్: గత నెల 9వ తేదీన కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అమరగిరి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిరుత పులి సహజ మరణంతోనే మృతి చెందినట్లు స్థానిక ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ వెల్లడించారు. చిరుత మృతిపై అనుమానాలను నివృత్తి చేసేందుకు కోసం చిరుత అవయవాలను హైద్రాబాద్ పోరెన్సిక్ ల్యాబరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించామని, అయితే మెడికల్ రిపోర్ట్ లో సహజ మరణంతో మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. మృతికి అనారోగ్యం కూడా కారణం కావచ్చన్నారు. శనివారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ లో ఎఫ్ఆర్వో చంద్ర శేఖర్ విలేకరులకు తెలిపారు. అప్పట్లో చిరుత పులి మృతి పై కలకలం రేగడంతో ఆశాఖ అధికారులకు సవాల్ గా మారింది. చనిపోయిన చిరుత వయస్సు పదేళ్లు ఉంటుందని ఎఫ్ఆర్వో చంద్ర శేఖర్ పేర్కొన్నారు. వాస్తవంగా అడవిలో సంచరించే చిరుత పులి 12ఏళ్లు ,అదే జూ పార్క్ లో నైతే 20 ఏళ్లు మనుగడ ఉంటుందని ఆయన చెప్పారు. ఇదిలావుండగా కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవుల్లో పులులు,చిరుతలు సంచరిస్తుండడంతో అటవీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.