ఎక్కడ విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాలేదు
అచ్చంపేట నియోజకవర్గంలోని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ క్యాంప్ ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు.
దిశ, అచ్చంపేట : అచ్చంపేట నియోజకవర్గంలోని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ క్యాంప్ ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అచ్చంపేట నియోజకవర్గంలో ఎక్కడెక్కడ విద్యుత్ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అభివృద్ది పనులనులకు ఎక్కడ ఆటంకాలు కలుగుతున్నాయి , నూతన సబ్ స్టేషన్ నిర్మాణాలు, వాటికి సంబంధించిన స్థల పరిశీలన మొదలైన వాటి పై సమీక్ష సమావేశంలో కులం కుశంగా చర్చించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎక్కడ కరెంటు సమస్య లేవని..కానీ కావాలని విద్యుత్ సమస్యలు సృష్టిస్తే సహించేది లేదన్నారు. ఎక్కడ సమస్య ఏర్పడిన అధికారులు అప్రమత్తమై దురదగతిన వాటిని పునరుద్ధరించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డి ఈ శ్రీధర్ శెట్టి, ఏడిఈ శ్రీనివాస్, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఏఈలు ఆంజనేయులు, టి రమేష్,అప్పలనాయుడు, సుధాకర్ రావు, కొండల్, మేఘనాథ్, జానకిరామ్ మరియు అన్ని మండలాల లైన్మెన్లు పాల్గొన్నారు.