రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
రైతు సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు.
దిశ, జడ్చర్ల: రైతు సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవ కేంద్రం - 2 లో వ్యవసాయ సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల సబ్సిడీ జీలుగా విత్తనాల కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల సంక్షేమానికి పాటు పడుతున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతుల కోసం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వడం జరిగిందని, రూ. 30 లక్షల విలువగల విత్తనాలను రైతులకు 65 శాతం సబ్సీడిపై సహకార సంఘం ద్వారా అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోడగల్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి, మూడ డైరెక్టర్ ఇంతియాజ్, శ్రీకాంత్, నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.