ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిధి ఆప్కే నికాత్
ఉద్యోగులు,యాజమానుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిధి ఆప్కే నికాత్ 2.0 కార్యక్రమం అని మహబూబ్ నగర్ జిల్లా నోడల్ అధికారి ప్రసాద్ కుమార్ అన్నారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఉద్యోగులు,యాజమానుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిధి ఆప్కే నికాత్ 2.0 కార్యక్రమం అని మహబూబ్ నగర్ జిల్లా నోడల్ అధికారి ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక జయరామ మోటార్స్ షో రూంలో ఏర్పాటు చేసిన నిధి ఆప్కే నికాత్ 2.0 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..పీఎఫ్ యజమానులు,వాటాదారుల సమస్యలను నమోదు చేసుకొని పరిష్కారానికి కృషి చేసి,పరిష్కారం కానివి ఈపీఎఫ్ పోర్టల్ లో నమోదు చేస్తామన్నారు. ఈ ప్రోగ్రాంలో ఆన్ లైన్ క్లెయిమ్ లు,హెల్ప్ డెస్క్,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వాటాదారుల సమస్యలపై జిల్లా స్థాయి అధికారులతో సమాచారం సేకరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు మాట్లాడుతూ..సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు హైయ్యర్ పెన్షన్ డిమాండ్ నోటీసులు సీనియార్టీ ప్రకారం కాకుండా జూనియర్లకు వస్తున్నాయని,సీనియార్టీ ప్రకారం డిమాండ్ నోటీసులు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సెక్యూరిటీ అసిస్టెంట్లు అనీల్ కుమార్,హర్షశర్మ,కొండాపూర్ భాస్కర్,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.