వ్యక్తి అనుమానాస్పద మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన గండీడ్ మండలం పంచాంగల్ తాండాలో చోటు చేసుకుంది.

Update: 2024-12-27 15:49 GMT

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన గండీడ్ మండలం పంచాంగల్ తాండాలో చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల మేరకు..పంచాంగల్ తాండాకు చెందిన లావుడియా రఘువీర్ ( 26 ) ఒక్కడే నివాసం ఉండేవాడు. శుక్రవారం రఘువీర్ 7 గంటల సమయంలో బాత్రూం ముందు పడి చనిపోయాడు. అయితే తన అన్న కొడుకు మృతి అనుమసనాస్పదంగా ఉందని లావణ్య, పాండు నాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


Similar News