తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేస్తాం
జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం ప్రక్కన 'తెలంగాణ తల్లి' విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం ప్రక్కన 'తెలంగాణ తల్లి' విగ్రహాన్ని ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీజెఏసి అధ్యక్షుడు జి.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో..తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని కలసి పట్టణంలో 'తెలంగాణ తల్లి' విగ్రహం ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా కేంద్రంలో 'తెలంగాణ తల్లి' విగ్రహం ఏర్పాటుకై ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చంద్రనాయక్,చంద్రకాంత్ రెడ్డి,కె.శంకర్,రాజు,రియాజోద్ధీన్,కె.రవీదర్ రెడ్డి,బాల్ కిషన్,సాయిల్ గౌడ్,అంజయ్యచారి,హానీఫ్,తదితరులు పాల్గొన్నారు.